కరోనా కారణంగా దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లు దాదాపు 16 నెలల తర్వాత పట్టాలెక్కాయి. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించారు. ఇందులో 16 ఎక్స్ ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. కొత్త నెంబర్లతో అధికారులు వాటిని పట్టాలెక్కించారు అధికారులు. ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు ఇలా చాలామంది రోజూ ప్యాసింజర్ రైళ్లపై ఆధారపడ్డారు. 16 నెలలుగా వాటిని నిలిపివేయడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలకు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్యాసింజర్ రైళ్లు అందుబాటులోకి రావడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులోకి వచ్చిన ప్యాసింజర్ రైళ్లలో రాజమండ్రి- విజయవాడ, విజయవాడ-మచిలీపట్నం, నిడదవోలు-నర్సాపూర్, కాచిగూడ-కరీంనగర్, రేణిగుంట-గుంతకల్, గూడూరు-రేణిగుంట, మాచర్ల-విజయవాడ, గుంటూరు-రేపల్లె, గుంటూరు-విజయవాడ, సికింద్రాబాద్-వరంగల్, హైదరాబాద్-కాజీపేట వంటి రైళ్లు ఉన్నాయి.
ఈ వార్త కూడా చదవండి: మధుమేహం రోగులకు గుడ్ న్యూస్