Friday, November 22, 2024

సంపన్నుల కోసం, సంపన్నుల చేత, సంపన్నుల కొరకు: బడ్జెట్ పై కాంగ్రెస్ నేత చిదంబరం

కేంద్రం అసంతృప్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని కాంగ్రెస్‌ నేత చిదంబరం విమర్శించారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ప్రభుత్వం తీరును ఎండగట్టారు. ఇది సంప న్నుల కోసం.. సంపన్నుల చేత.. సంపన్నుల కొరకు అన్నట్లు ఉందని అభివర్ణించారు. 73 శాతం దేశ సంపదను హస్తగతం చేసుకున్న ఒక శాతం సంపన్నుల కోసమే ఈ పద్దు తయారు చేశారని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్‌ను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన ఆయన, కేంద్రం విధానాన్ని తప్పుబట్టారు. అసమర్థ ఆర్థిక పంపిణీ నిర్వహణగా ఉందని ధ్వజమెత్తారు. ఇది కేవలం పేదలకు మేలు చేసేదిగా ఉందన్నారు. పేదలకు ఏమీ లేదన్నారు. ఆర్థికవ్యవస్థ నెమ్మదించిన విషయాన్ని అంగీక రించని ఈ ప్రభుత్వం, చక్రీయ, నిర్మాణాత్మక వ్యవస్థగా నమ్ముతోంది. కరోనా కంటే రెండేళ్ల ముందే ఆర్థికవ్యవస్థ కుంటుపడిన మాట వాస్తవమన్నారు. అసమర్థ అనే పద ప్రయోగానికి ఆర్థికమంత్రి అభ్యంతరం చెబుతున్నారు. ఇంతకంటే తేలికైన పదం నా వద్ద లేదు. నేను కఠిన పదాలు ఉపయోగించట్లేదు. మూడేళ్ల తిరోగమన ఆర్థిక వ్యవస్థ అంటే, 2020-21లో మనం 2017-18 నాటికి వెళ్లినట్లుగా గమనించాలని చెప్పారు.
అంకెల గారడీలు చేయకండి. స్థిరమైన వృద్ధిరేటు కోసం మీకు రెండు మూడేళ్లు పడుతుంది. ఇప్పటికైనా సద్విమర్శ కుల నుంచి సలహాలు తీసుకోండి. నిర్మాణాత్మక ఆర్థికవ్యవస్థ ను చర్చించండి. పేదలకు మద్దతివ్వండి. ఈ బడ్జెట్‌ను వెనక్కి తీసుకోండి. ఇందులో చాలా అంశాల అనుమానా స్పదంగా ఉన్నాయి. అదనపు స్థూల మూలధన వ్యయాన్ని రూ.51వేల కోట్లుగా పేర్కొన్నారు. మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్లినట్లు? ఖర్చులు నాలుగు లక్షల కోట్ల అదనంగా చూపారు. అదే సమయంలో ఆదాయం మూడు లక్షల కోట్లు తగ్గువగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఈ లెక్కలను పరిశీలిం చుకోండి. కచ్చితంగా గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తుం ది. మొదటిసారి బడ్జెట్‌లో రక్షణ ఊసెత్తలేదు. ఆరోగ్య కేటాయింపులకు కత్తెరవేశారు. కరోనా మహమ్మారివేళ ఇది సరైన నిర్ణయం కాదు. ఈ పద్దను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నది. మా నిరసన, అసంతృప్తి రికార్డు చేయండి. ఈ అసంతృప్తి తెలిపినందుకు మమ్మల్ని ఆందోళన్‌జీవి, పరజీవి అని పిలి చినా ఫర్వాలేదు అంటూ చిదంబరం వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement