ఆస్ట్రేలియా లెజెండ్రీ స్పిన్నర్ షేన్ వార్న్ కరోనా కి కరోనా సోకింది. ప్రస్తుతం లండన్ స్పిరిట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా షేన్ వార్న్ వ్యవహరిస్తున్నాడు. అయితే మ్యాచ్‌కు ముందు ఉదయం అస్వస్థతకు గురవగా.. పరీక్షలు చేయించుకోగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో జట్టు నుంచి విడిపోయి ఐసోలేషన్‌లో ఉన్నాడని.. జట్టు మేనేజ్మెంట్ బృందంలో ఓ సభ్యుడికి సైతం కరోనా సోకిందని, ఆయన కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారని తెలిపింది. వార్న్‌తో సన్నిహితంగా ఉన్న జట్టు సిబ్బందిలో ఒకరు పరీక్ష చేయించున్నారు. ఫలితాలు రావాల్సి ఉందని, అయితే, జట్టులోని ఆటగాళ్లపై ప్రభావం ఏమీ లేదని లండన్ సిర్పిట్ క్లబ్ చెప్పింది. దీంతో ‘ది హండ్రెడ్’ లీగ్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం లీగ్ ఇంగ్లాండ్‌లో జరుగుతుండగా.. లండన్ స్పిరిట్ జట్టుకు చీఫ్ కోచ్‌గా షేన్ వార్న్ వ్యవహరిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Tokyo Olympics: సెమీస్ లో భారత మహిళా హాకీ జట్టు..