Saturday, November 23, 2024

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. వర్షల కారణంగా ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఇక శ్రీశైలం జలాశయానికి వరద నీరు వెల్లువల వచ్చి చేరుతోంది. లక్షకు పైగా ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,09,446 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 40,847 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 882.20 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 200.1971 టీఎంసీలుగా ఉంది. అయితే ప్రస్తుతం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కానీ కుడి గట్టు విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనలు ఉండటంతో ఈ వరద మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: సీఎం పదవి తప్ప అన్ని అనుభవించాడు: ఈటలపై హరీష్ వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement