కరోనా సమయంలో డాక్టర్లు చేసిన సేవ చాలా గొప్పదని తెలిపారు మెగాస్టార్ చిరంజీవిగారు. వైద్యుల సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తమ ప్రాణాలను లెక్క చేయకుండా రోగులకు చికిత్స అందించారు. నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించిన వైద్యులు సిబ్బంది ఎంతో మందికి ప్రాణదానం చేశారు. అలాంటి వైద్యులను కలిసి అభినందించారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రికి చిరంజీవి వెళ్లారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు చిరు. వైద్యులు సిబ్బందితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ‘ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి అక్కడి డాక్టర్లను కలిసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా సమయంలో వారు చేసిన సేవ ఎంతో గొప్పది. ఇంతటి దారుణ పరిస్థితులలోనూ ఆసుపత్రిని ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్లిన పద్మభూషణ్ అవార్డు గ్రహిత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి నా హృదయపూర్యక ధన్యవాదాలు’ అని తన ట్వీట్ లో తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement