స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన వివాహ వేడుకను విహార యాత్రలో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. బన్నీ, స్నేహ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తాజ్ మహల్‌ను సందర్శించారు. తన కెరీర్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యం ఇచ్చే బన్నీ తమ 10 వ మ్యారేజ్ డేను గుర్తుడిపోయేలా కుటుంబంతో కలిసి విహార యాత్రలకు వెళ్లారు. 2011 మార్చి 6వ తేదీన బన్నీ, స్నేహల వివాహం జరిగింది. నేటితో వారి వివాహ బంధానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బన్నీ తన భార్య స్నేహతో కలిసి తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లాడు.
ప్రేమసౌధం ముందు తన భార్యతో కలిసి ఫొటోలు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మనకు 10వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు క్యూటీ. ఈ పదేళ్ల ప్రయాణం ఎంతో అద్భుతంగా జరిగింది. ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలి’ అని బన్నీ కామెంట్ చేశాడు. బన్నీ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న
పుష్ప` సినిమాలో నటిస్తున్నాడు.