వాషింగ్టన్: ప్రజాస్వామ్య ప్రభుత్వంపై మయన్మార్ సైనిక తిరుగుబాటుపై అమెరికా ఆగ్రహం వ్యక్తంచేసింది. సైనిక అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. తిరుగుబాటుకు ఆదేశాలిచ్చిన ఆర్మీ అధికా రులపై తక్షణ ఆంక్షలకు వీలుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ఆమోదించినట్లు చెప్పారు. ఈ ఆర్డర్ మేరకు సైనిక అధికారు ల వ్యాపార ప్రయోజనాలు, వారి కుటుంబ సభ్యుల, సన్నిహి తుల వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తామని పేర్కొన్నారు. అమెరికాలో బర్మా ప్రభుత్వ నిధులు కోటి డాలర్లు న్నాయి. వీటిని మిలటరీ జనరల్స్ పొందకుండా నిరోధిం చిందేకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బిడెన్ వివరించారు. అదే సమయంలో బలమైన ఎగుమతు ల నియంత్రణలను విధించనున్నామని చెప్పారు. ఆరోగ్య సంరక్షణ, పౌర సమాజ సమూహాలు, బర్మా ప్రజలకు నేరు గా ప్రయోజనం కలిగించే ఇతర అంశాలను మద్దతు కొనసాగిస్తామని చెప్పారు. ఆంగ్‌సాన్ సూకీ, విన్ మైంట్తోసహా నిర్బంధంలోకి తీసుకున్న నిరసనకారులు, పౌరనాయకుల ను విడుదల చేయాలని, ప్రదర్శన కారులపై దాడులు ఆపాలని మిలటరీ జుంటాకు బిడెన్ పిలుపునిచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement