ఈ భూమ్మిద వర్షం కురవని ప్రాంతం ఉంది అంటే నమ్ముతారా..? భూమిపై ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వర్షం కురుస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఇప్పటి వరకు వర్షం కురవలేదంటే నమ్మగలరా? ఇదేంటి వింత అనుకుంటున్నారా ! అవును ఆ గ్రామంలో ఇప్పటి వరకు వర్షం కురవలేదట..అది ఎక్కడో లేదు యొమెన్ లో ఉందంట..ఆ గ్రామం పేరు ‘అల్-హుతైబ్’. ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉంది.
దీని ప్రకారం మేఘాల కంటే ఎత్తులో ఆ గ్రామం ఉన్నదన్న మాట. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. అక్కడ వాతావరణ విషయానికొస్తే ఉదయం పూట ఎండ, రాత్రి సమయం చలిగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా ఆ వాతావరణం అలవాటే. కాగా ఆ వింత ప్రాంతాన్ని చూసేందుకు టూరిస్టులు తాకిడి బాగానే ఉంటుందట.
ఇది కూడా చదవండి: రేవంత్ ఇప్పుడే సీఎం అయిపోయారా?