Friday, November 22, 2024

వరుసగా మూడోరోజూ లాభాలే

ఈ నెలలో వరుసగా మూడోరోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 1,147 పాయింట్ల లాభంతో 51,444 వద్ద స్థిరపడగా నిఫ్టీ 326 పాయింట్ల లాభంతో 15,245 పాయింట్ల వద్ద ముగిసింది. గ్లోబల్ మార్కెట్ల జోరుతో దేశీయ మార్కెట్లు బుధవారం ఉదయం ట్రేడింగ్ ఆరంభించగా అంతకంతకూ లాభాలను నమోదు చేస్తూ వెళ్లాయి. నిఫ్టీలో ఆటోమొబైల్ రంగం తప్ప అన్ని కీలక రంగాలు లాభాలను నమోదు చేశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్ సంస్థలు లాభాలను గడించగా.. మారుతి సుజుకీ, మహింద్రా అండ్ మహింద్రా, బజాజ్, భారత్ పెట్రోలియం, హీరో మోటోకార్ప్ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.72.83గా ట్రేడ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement