బీహార్‌లో విచిత్రం చోటు చేసుకుంది. ఫోటోలో చూసినట్లు వరుడు లేడని బీహార్‌లో ఓ యువతి పెళ్లి మండపం నుంచి అలిగి వెళ్లిపోయింది. పశ్చిమ చెంపారన్ జిల్లా బైరియాలోని తదీవానందపూర్‌కు చెందిన ఓ యువతికి మరో గ్రామానికి చెందిన అనిల్ కుమార్ అనే యువకుడితో పెళ్లి నిశ్చయించారు. వాట్సాప్‌లో అనిల్ కుమార్ ఫోటో చూసిన యువతి పెళ్లికి ఒప్పుకుంది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు వారి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పెళ్లి మండపానికి చేరుకున్న వరుడిని చూసిన వధువు ట్విస్ట్ ఇచ్చింది. ఫోటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లి చేసుకోనంటూ పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. చివరకు పెళ్లి ఆగిపోవడంతో బంధువులు నిరాశగా ఇంటిదారి పట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement