మామూలుగా కూతురికి పెళ్లి చేసేటప్పుడు పెళ్ళికొడుకుకు ఆయన మామగారు కట్నం కింద బైకు, కారు ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. కానీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం అల్లుడికి ఎడ్లబండి, జోడెడ్లను కానుకగా ఇచ్చాడు ఆ మామ. అయితే ఇదేదో పెట్రోల్ ధరలకు నిరసనగా ఇచ్చిన కానుక అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.
వివరాల్లోకి వెళ్తే… జైనూరు మండలం కాశీపటేల్‌గూడకు చెందిన నగేశ్‌కు నర్నూరు మండలం ఖైర్‌డాట్వా గ్రామానికి చెందిన రేణుకతో శుక్రవారం వివాహం జరిగింది. నగేష్ పెద్దగా చదువుకోలేదు. దీంతో పొలం పనుల అవసరాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో రేణుక తల్లిదండ్రులు చక్కగా అలంకరించిన జోడు ఎడ్లబండిని కానుకగా అందించారు. అదీ సంగతి.