Friday, November 22, 2024

లాభాలతో ముగిసిన మార్కెట్లు


దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ మగిసిన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ తదితర సంస్థలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంలో మార్కెట్లు నష్టపోయాయి. అయితే మధ్యాహ్నం తర్వాత ఐటీ స్టాకుల్లో కొనగోళ్లు ఊపందుకోవడంతో చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 51,280కి ఎగబాకింది. నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 15,175 వద్ద స్థిరపడింది.మార్కెట్లో ఇవాళ టాప్‌ గెయినర్స్‌గా బజాజ్ ఫైనాన్స్, ఫార్మా, టెక్ మహీంద్రా , బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి.టాప్ లూజర్స్‌గా
ఓఎన్జీసీ , కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ , పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement