యావత్ మానవాళి తదుపరి ఎదుర్కోబోయే ముప్పు ‘బయోటెర్రరిజం’ అని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థపకు డు, బిలియనీర్ బిల్‌గేట్స్ హెచ్చరించారు. ఎవరైనా హాని తలపెట్టాలనుకున్నడు వైరస్‌ను సృష్టించి బయో టెర్రరిజాన్ని సృష్టించే అవకాశం ఉందని ఆయన అన్నారు. తదుపరి చవిచూడబోయే ఈ విపత్తును ఎదుర్కొంనేందుకు మానవాళి ఇంకా సంసిద్ధంకాలేదని ఆయన హెచ్చరించారు. అంటే ప్రస్తుత కరోనా వైరస్ మాదిరిగానే కొత్తగా మహమ్మా రులు పుట్టుకురావడం సహజమైన అంశమేనని ఆయన అన్నారు. అణుయుద్ధం కంటే ప్రమాదకరమైన బయోటెర్ర రిజం గురించి బిల్‌గేట్స్ హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన హెచ్చరించారు. బయోటెర్రరిజానికి దారితీసే బయోలాజికల్ టూల్స్‌పై 2017లోనే ‘రెడిట్’ వేదికగా ఆయన ఆందోళన వెలిబుచ్చా రు. అదే ఏడాది టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఫ్లూ స్ట్రెయిన్’ను సృష్టించడం సులభమవ్వొచ్చని ఆయన హెచ్చరించారు. అణుయుద్ధం మాదిరిగా కాకుండా… వ్యాధులు ఒక్కసారి పుట్టుకొస్తే మనుషులను చంపుతూనే ఉంటాయని ఆందోళన వెలిబుచ్చారు. ఇక ప్రకృతి విపత్తులు కూడా మానవాళి ఎదుర్కోబోతున్న సవాళ్లలో ప్రధానమై నవని అన్నారు. ప్రకృతి విపత్తులు సంభవిస్తే మరణాలు రేటు మహమ్మారుల కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. గతేడాది తన బ్లాగ్ ‘గేట్స్‌నోట్స్’ లో బిల్‌గేట్స్ రాసిన దాని ప్రకారం… 2060 నాటికి పర్యావరణ మార్పులు ప్రమాదక రమైన మహమ్మారులుగా మారుతాయి. 2100 నాటికి విపత్తులు 5 రెట్లు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. రానున్న దశాబ్దం లేదా రెండు దశాబ్దాల్లో వాతావరణ మార్పుల కారణంగా ఆర్థిక వ్యవస్థకు కోవిడ్ విధ్వంస పరిమాణంలో నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ప్రతి పదేళ్లకోసారి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి నష్టం అతి తీవ్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ లాంటి మహమ్మారుల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఏదో ఒక విపత్తును ఎదుర్కుంటూనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. మరణాల రేటును తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని ఆయన బిల్‌గేట్స్ సూచించారు. ప్రస్తుతం మరణాలు మరీ ఎక్కువగా లేదు. అయితే ఈ రేటును కూడా తగ్గించవచ్చు. చాలా దేశాలు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేయాల్సివుందని ఆయన అభిప్రాయపడ్డారు. సైన్స్ యూట్యూబర్ డెరెక్ ముల్లర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన విధంగా స్పందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement