14న మెగా రన్… స్పాన్సర్డ్ పార్ట్‌నర్‌గా ఆంధ్రప్రభ..
హైదరాబాద్, ఈనెల 14న ”రన్ ఫర్ ఏ కాజ్”లో పాల్గొని సమాజాన్ని వెలుగుల దిశగా తీసుకువెళ్లేందుకు స్ట్రీట్ కాజ్ సంస్థ సిద్ధమైంది. విద్యార్థుల అభివృద్ధి, తద్వారా సమాజ వికాసానికి పాటు పడేందుకు స్ట్రీట్ కాజ్ స్వచ్ఛంద సంస్థ సిద్ధమవు తోంది. ఉత్సహవంతమైన యువకులతో లక్ష్యం సాధించేందుకు కృషి చేయనుంది. యువతతోనే సమాజంలో మార్పు తీసుకు రావచ్చని భావిస్తోంది. 2010లో ఈ సంస్థ ఉత్తమ ఆర్గనైజేషన్ అవార్డును పొందింది. డెలాయిట్, గోల్డ్ డ్రాప్ ఇండస్ట్రీస్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వంటి సంస్థల సహకారంతో గతంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. 8 వేలకు పైగా కార్యక్రమాలు నిర్వహించింది. అనాధలు, వృద్ధులు, అణగారిన వర్గాలకు సహాయం చేయడం ఈ సంస్థ లక్ష్యంగా పని చేస్తోంది. నిరుద్యోగులు, శారీరక, మానసిక వికలాంగుల జీవితాలను మెరుగు పరిచేందుకు స్ట్రీట్ కాజ్ అనేక చర్యలు తీసుకుంది. యువతలో అవ గాహన పెం చడం, వారిని శక్తివంతం చేయడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. యువతను సరైన దిశలో నడిపి దేశాన్ని శక్తివంతం చేసి ప్రకాశవంతమైన జీవితాన్ని ఇవ్వాలని అనేక కార్యక్రమాలు చేసింది. ఈ దిశలో భాగంగా వివిధ గ్రామాల్లోని నిరుపేద ప్రజల జీవన పరిస్థితులను పెంపొందించేందుకు నిధుల సేకరణలో భాగంగా ప్రీమియర్ మారథాన్ రన్‌తో పాటు కచేరి, కామెడీ వంటి వర్చువల్ కార్యక్రమాలతో ప్రముఖులతో ప్యానల్ సెషన్, క్వీజ్, జుంబా, యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 14నమేడ్చల్‌లోని సీఎంఆర్‌ఐటీ ఆడిటోరియంలో నిర్వహించే ఈ కార్యక్రమం లో లక్ష పాసులను జారీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ మహ మ్మారిని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో ”రన్ ఫర్ ఏ కాజ్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి స్పాన్సర్డ్ పార్ట్‌నర్‌గా ‘ఆంధ్రప్రభ’ వ్యవహరిస్తోంది.
“రన్ ఫర్ ఎ కాజ్” ను విజయవంతం చేయండి….
Advertisement
తాజా వార్తలు
Advertisement