Friday, November 22, 2024

రెండో ప్రపంచ యుద్ధం తరువాత మళ్లీ ఇప్పుడే…

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిపై పోరులో అమెరికా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌. 100 రోజుల పాటు ఖచ్చింతంగా మాస్కులు ధరించాలని నిబంధనలు తీసుకువచ్చింది అక్కడి ప్రభుత్వం. మార్చి 1 నుంచి అమెరికాలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ రూపొందించిన సింగిల్‌ విండో వ్యాక్సిన్‌‌కు ఎఫ్‌డీఏ అనుమతులిచ్చింది. అంతే కాదు కోవిడ్‌ నివారణకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌‌తో చేతులు కలిపింది వ్యాక్సిన్‌ ఉత్పత్తి దిగ్గజం మెర్క్‌ ఫార్మా. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందిస్తూ రెండు ప్రధాన పోటీదారు సంస్థలు కరోనా పై పోరాటానికి కలిసి పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రెండ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లి ఇప్పుడే ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement