కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి, బీజేపీ నేత రమేష్ జార్కిహోళి రాసలీలల వ్యవహారం క్రమంగా ముదురుతోంది. ఈ రాసలీలల వీడియోలు మీడియాలో ప్రసారం కావడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మంత్రిని అరెస్ట్ చేయాలని, మంత్రి పదవి నుంచి రమేష్ జార్కిహోళిని తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం మంత్రి పదవికి రమేష్ జార్కిహోళి రాజీనామా చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని బెంగళూరు ఆర్టీ నగర్‌కు చెందిన ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి రమేష్ లోబర్చుకున్నారని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరి పరిచయం శారీరక సంబంధం వరకు వెళ్లిందని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. మంత్రి రమేష్ రాసలీలల వీడియోలు పలు టీవీ చానళ్లలో ప్రసారం కావడంతో సంచలనం చోటుచేసుకుంది. కాగా ఈ వీడియోలను ఎక్కడ, ఎవరు తీశారనేది స్పష్టత లేదు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆనక మోసం చేసినందుకు ప్రతీకారంగా బాధితురాలే పక్కా ప్రణాళికతోనే వీడియోలు తీయించి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
మరో కథనం ప్రకారం షార్ట్ ఫిల్మ్ తీసేందుకు మంత్రితో యువతి సాన్నిహిత్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని దినేశ్ కల్లహళ్లితో బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కర్ణాటక శాసనసభ సమావేశాలు మరో 2 రోజుల్లో మొదలవుతున్నాయి. అలాగే రమేష్ జార్కిహోళి అడ్డా బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగనుంది.