ఇప్పుడు తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి. జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్, మరో మూవీ కొరటల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆచార్య. ఈ రెండు సినిమాల్లో కూడా రామ్‌చరణ్ నటిస్తున్నాడు. ఫ్యాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ లో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న రామ్‌చరణ్.. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి
తో కలిసి ఆచార్యలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా మే 13న రిలీజ్ కానుంది దీంతో మెగా అభిమానులు ఆచార్య మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఆచార్యలో రామ్ చరణ్ క్యారెక్టర్ సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చాయి ఈమధ్య తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాడు చరణ్. మారేడుపల్లి అడవుల్లో కీలక సన్నివేశాల్లో తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల.
సినిమాలో చరణ్ క్యారెక్టర్ 30 నిమిషాలు ఉండబోతోందని తెలుస్తోంది. చరణ్ పాత్ర ఎమోషనల్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. చెర్రీ కూడా తన పాత్ర కోసం భారీ పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కొరటాలశివ మీద ఉన్న నమ్మకం తన తండ్రి సినిమా కావడంతో ఈ సినిమాలో నటించడానికి రామ్ చరణ్ ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ప్లాస్ బ్యాక్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాను మరో స్థాయికి తెసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆచార్య మూవీ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. మరో కీలక షెడ్యూల్ లో మిగితా షూటింగ్ కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే రాంచరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేస్తారని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. రామ్ చరణ్ కూడా ఇకపై త్రిబుల్ ఆర్ షూటింగ్ లో ఏకధాటిగా పాల్గొనబోతున్నాడట. అ మూవీ పూర్తయిన తర్వాత శంకర్ మూవీలో నటించనున్నాడు రామ్ చరణ్.