టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌కు భారత్ తరఫున మరో ముగ్గురు అథ్లెట్లు అర్హత సాధిం చారు.నేషనల్ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపి యన్‌షిప్‌లో సందీప్‌కుమార్, ప్రియాంక గోస్వామి 20కిలోమీటర్ల విభాగంలో జాతీయ రికార్డులు నెలకొల్పారు. కరోనా విరామం తర్వాత దేశంలో జరుగుతున్న దేశవాళీ క్రీడాపోటీలు ఇవే. కాగా ఈ విభాగంలో కేటీ ఇర్ఫాన్ (పురుషుల 20కి.మీ), భావన జాట్ (ఉమెన్స్ 20కి.మీ) ఇప్పటికే అర్హత సాధించారు. తాజాగా శనివారం జరిగిన పోటీలో సందీప్ 20కిలోమీటర్ల గమ్యాన్ని 1గంట 20నిమిషాల 16సెకన్లలో చేరుకోగా ప్రియాంక గోస్వామి 1గంట 28నిమిషాల 45సెకన్లలో చేరుకుంది. అదేవిధంగా రాహుల్ కూడా ఒక గంట 20నిమిషాల 26సెకన్లలో చేరుకు న్నాడు. ఒలింపిక్స్‌లో అర్హత సాధించాలంటే పురుష అథ్లెట్లు 1గంట 21నిమిషాల్లో, మహిళలు అయితే 1గంట 31నిమిషాల్లో 20కిలోమీటర్ల నడకను పూర్తి చేయాలి. టోక్యోలో ఈ ఏడాది జూలై-ఆగస్టు మధ్య ఒలింపిక్స్ నిర్వహించనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement