బెంగుళూరు: కర్ణాటక రాసలీలల మంత్రి రమేష్ జార్కిహోళి ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. తనను బీజేపీ అధిష్టానం రాజీనామా చేయమని కోరలేదని, తనకు తాను రాజీనామా చేశానన్నారు. తనపై పెద్ద కుట్ర జరిగిందని.. ఈ సీడీ తన దృష్టికి నాలుగు నెలల క్రితమే వచ్చిందన్నారు. ఇదే విషయాన్ని తన సోదరుడికి అప్పుడే చెప్పినట్లు రమేష్ చెప్పుకొచ్చారు. అధిష్టానం న్యాయ సహాయం అందిస్తామని తనకు చెప్పినా సొంతగానే పోరాడతానని చెప్పినట్లు తెలిపారు. ఈ విషయంలో మీడియానే తనను విలన్‌గా చిత్రీకరించిందని, పార్టీకి చెడ్డ పేరు రావొద్దనే కారణంగానే తాను మంత్రి పదవిని వదులుకున్నానని ఆయన అన్నారు. కాగా ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రమేష్ లైంగిక వేధించినట్లు సీడీతో సహా సామాజిక ఉద్యమకారుడు దినేష్ బయట పెట్టిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement