కొవిడ్-19ను ఎదుర్కోవడంలో విఫలమైన నరేంద్ర మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. వ్యాక్సినేషన్ భారాన్ని రాష్ట్రాలపైకి నెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని తానెన్నడూ చూడలేదని అన్నారు. మోదీ ప్రభుత్వ ఏడేండ్ల పాలనను ప్రస్తావిస్తూ కరోనా మహమ్మారి నియంత్రణకు అవసరమైన ఏర్పాట్లు, సన్నద్ధతలో సర్కార్ అసమర్ధ విధానాలు ప్రస్తుత దుస్థితికి దారితీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. పటిష్ట ప్రభుత్వం ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు వారికి ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈవెంట్ మేనేజ్ మెంట్, వివాదాలతో ఫలితం ఉండదని హితవు పలికారు. 70 ఏండ్ల స్వతంత్ర దేశంలో కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిందని సచిన్ పైలట్ గుర్తుచేశారు. తొలిసారిగా వ్యాక్సినేషన్ ను రాష్ట్రాలపైకి నెట్టడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు
Advertisement
తాజా వార్తలు
Advertisement