ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్‌లో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇండియా టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న టోర్నీ నుంచి వెనుదిరిగాడు. బెన్ మెక్లాహన్‌తో కలిసి పురుషుల డబుల్స్‌లో పాల్గొన్న బోపన్న.. తొలి రౌండ్‌లో సుంగ్ నమ్-మిన్ క్యు జంట చేతిలో 4-6, 6-7 పా యింట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు. గంట 17 నిమిషాల పాటు సా గిన ఈ పోరులో తొలి సెట్‌లో బోపన్న జోడి తేలిపోయింది. అయితే రెండో సెట్‌లో ఎంతో పోరాటం చేసినప్పటికీ.. ఓటమి తప్పలేదు.
థీమ్ వర్సెస్ నిక్
ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిర్గియోస్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 29వ సీడ్ ఫ్రెంచ్ క్రీడాకారుడు ఉగో హంబర్ట్‌పై 5-7, 6-4, 3-6, 7-6 (7/2), 6-4 పాయింట్ల తేడాతో నిక్ విజయం సాధించాడు. ఆరో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ జ్వేరేవ్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 2 గంటల 4 నిమిషాల పాటు ఫ్రెంచ్-అమెరికన్ ఆటగాడైన మాగ్జిమ్ క్రెస్సీని ఓడించాడు. 7-5, 6-4, 6-3 పాయింట్ల తేడాతో మూడు సెట్స్‌లో జ్వెరేవ్ విజయం సాధించాడు. 2వ సీడ్ సిమోనా హాలెప్ కూడా మూడోరౌండ్‌లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలి యాకు చెందిన అజ్లా టాంల్జనోవిక్‌ను చిత్తుగా ఓడించింది. 2 గంటల 34 నిమిషాల పాటు జరిగిన పోరులో అజ్లాపై సిమోనా.. 6-4, 4-6, 7-5 సెట్స్ తేడాతో గెలుపొందింది. అదేవిధంగా జపాన్‌కు చెందిన 3వ సీడ్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా ఫ్రెంచ్ క్రీడాకారిణి గార్సియాపై 6-2, 6-3 పాయింట్ల తేడాతో ఒసాకా విజయం సాధించింది. డొమ్నిక్ థీమ్ జర్మనీకి చెందిన డొమ్నిక్ కోఫెర్‌పై 6-4, 6-0, 6-2 తేడాతో థీమ్ గెలుపొందాడు. మూడో రౌండ్‌లో నిక్ కిర్గియోస్‌తో డొమ్నిక్ థీమ్ తలపడుతాడు. అమెరికా ఆటగాడు ఫ్రాన్సెస్ టియాఫోపై నొవాక్ జకోవిచ్ 6-3, 6-7 (3/7), 7-6 (7/2), 6-3 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.
మెల్ బోర్న్ : బోపన్న జోడీ ఓటమి
Advertisement
తాజా వార్తలు
Advertisement