Friday, November 22, 2024

మెదక్ : రైతు సంఘటిత కేంద్రాలు రైతు వేదికలు

రైతులకు సంఘటితం చేసే కేంద్రాలుగా రైతు వేదికలు నిలుస్తాయని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా శంకరపల్లి మండలం శేరిపల్లిలో రైతు వేదికను ఆయనీ రోజు ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడిన మంత్రి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత వేసిన ప్రతి అడుగూ రైతు కోసమే వేసిందని అన్నారు. ఎవరూ అడగకపోయినా, ఆందోళన చేయకపోయినా కేసీఆర్ రైతుగా అహర్నిశలూ రైతు మేలు కోసమే ఆలోచించారనీ, రైతుల కోసం ఇవన్నీ చేశారనీ చెప్పారు.  కాంగ్రెస్ హయాంలో మోటార్ కాలకుండా, ట్రాన్స్ ఫార్మర్ పేలకుండా వ్యవసాయం చేశారా అని ప్రశ్నించారు. అదే ప్రత్యేక రాష్ట్రం, తెరాస అధికారం వచ్చాకా 24 గంటల విద్యుత్ ఇచ్చి తెలంగాణను దేశంలోనే ననంబర్ వన్ గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒఖ్క రాష్ట్రంలోనైనా అక్కడి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తోందా అని హరీష్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement