Sunday, November 24, 2024

మూడు రోజుల లాభాలకు బ్రేక్

వరుసగా మూడు రోజుల పాటు లాభాలను గడించిన స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. సెన్సెక్స్‌ 598 పాయింట్లు నష్టపోయి 50,846 వద్ద ముగియగా.. నిఫ్టీ 164.80 పాయింట్ల నష్టంతో 15,080 వద్ద స్థిరపడింది. ఉదయం 50,711 పాయింట్ల వద్ద నష్టాలతో సెన్సెక్స్ ప్రారంభమైంది. అనంతరం ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్లు నష్టపోయింది. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మెటల్‌, ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు కాస్త ఫర్వాలేదనిపించాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.83గా ఉంది. అటు అంతర్జాతీయ మార్కెట్లు సైతం ఈరోజు నష్టాలను చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement