Friday, November 22, 2024

ముంబై : మూడు, నాలుగు త్రైమాసికాల్లో గణనీయ వృద్ధి

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 మూడు, నాలుగో త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు దృఢంగా నమోదవ్వొచ్చునని పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(పీహెచ్‌డీసీసీఐ) అంచనా వేసింది. గత 10 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన సంస్కరణల దన్నుతో గణనీయమైన వృద్ధి నమోదుకానుందని విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ, వ్యాపారాలకు సంబంధించిన 10 క్విక్‌ ఎకనామిక్‌ ట్రెండ్స్‌(క్యూఈటీ) సూచీల్లో 9 సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మైనస్‌ 23.9 శాతం మేర క్షీణించింది. ఆ తర్వాత రెండో త్రైమాసికంలో మైనస్‌ 7.5 శాతం మేర పతనమైంది. అయితే గత 10 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో డిమాండ్‌కు ఊతమిచ్చినట్టయింది. బడ్జెట్‌ కూడా క్యు3, క్యు4లలో వృద్ధి అంచనాలను మెరుగుపరిచిందని రిపోర్ట్‌ పేర్కొంది. నిరుద్యోగ రేటు, స్టాక్‌ మార్కెట్‌, జీఎస్టీ వసూళ్లు, తయారీ పీఎంఐ, విదేశీ మారక నిల్వలు, ఎక్స్చేంజ్‌ రేట్లు, ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు డిసెంబర్‌తో పోల్చితే జనవరిలో సానుకూలంగా ఉన్నాయని రిపోర్ట్‌ ప్రస్తావించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement