Friday, November 22, 2024

ముంబై : ఆటోలో మాన్యాసింగ్- సన్మాన వేదికపై తల్లిదండ్రులకు కిరీటం

వీఎల్‌సీ మిస్‌ ఇండియా – 2020 పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన మాన్యా సింగ్‌ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆటో డ్రైవర్‌ కూతురు ఈ స్థాయి కి ఎదిగినందుకు ప్రతీ ఒక్కరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ముంబై లో ఆమె చదివిన కాలేజీ యాజమాన్యం.. మాన్యా సింగ్‌కు సన్మానాన్ని ఏర్పాటు చేసింది. ఈ సన్మానానికి ఆమె తన తండ్రి ఓం ప్రకాష్‌తో ఆటోలోనే వచ్చింది. ఆటో దిగిన తరువాత.. తన తల్లి కాళ్లకు నమస్కారం చేసి హత్తుకుంటూ.. కన్నీరు పెట్టుకుంటున్న తండ్రిని దగ్గర తీసుకొని.. కౌగలించుకుంటూ.. తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చాటుకుంది. కళ్ల నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుస్తూ.. ‘నాన్న సాధించాను’ అని సగర్వంగా చెప్పుకుంది. తండ్రిని కౌగిలించుకుంటూ.. తల్లికి పాదాభివందనం చేస్తూ.. ఉన్న వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. కాలేజీ లో.. తల్లిదండ్రులతో కలిసి ఫొటోకు ఫోజ్‌ ఇస్తున్న సమయంలోనే.. తన తలపై ఉన్న కిరీటాన్ని తీసి అమ్మకు పెట్టడం.. ఆ తరువాత తండ్రికి పెట్టడం అక్కడ ఉన్న వారందరినీ కంటతడిపెట్టించింది. వూంప్లా అనే నెటిజన్‌.. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో.. కొన్ని గంటల్లోనే లక్షలాది మంది చూశారు. ముంబైలోని ఆమె కాలేజీకి చేరుకున్న ఓం ప్రకాశ్‌.. కిలో మీటర్‌ మేర సుమారు 20 ఆటోలతో ఓ ర్యాలీ ని తీశాడు. తన కూతురును ఆటోలో ఎక్కించుకుని ఆ కాలేజీ ప్రాంగణం చుట్టూ చక్కర్లు కొట్టాడు. తల్లిదండ్రులకు మరిచిపోలేని మధుర జ్ఞాపకాలను పంచుతు న్నది. 14 ఏళ్ల వయస్సులో తన తండ్రి తన కలను నమ్మి.. అహోరాత్రులు శ్రమిం చి.. వాళ్లు పస్తులున్నా.. తనకు ఏ లోటు రాకుండా చూసుకున్నారని మాన్యా సింగ్‌ తెలిపింది. ఇంట్లో డబ్బు సరిపోక తాను పిజ్జా హాట్‌లో పని చేసే దానినని తెలిపింది. మిస్‌ ఇండియా రన్నరప్‌ ద్వారా వచ్చిన డబ్బులతో తన తల్లిదండ్రులకు ఇల్లు కొనిస్తానని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement