ఈ-కామర్స్ దిగ్గజం.. అమెజాన్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా ఎలక్ట్రిక్‌తో కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వివరించింది. అమెజాన్ యూజర్లు బుక్ చేసిన వస్తువులను సరఫరా చేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తున్నట్టు తెలిపింది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ తయారు చేస్తున్న వాటిని కొనుగోలు చేస్తూ.. ఒప్పందం కుదుర్చుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. 7 నగరాల్లో లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే మహీంద్రా ‘ట్రయో జోర్’ త్రీ వీలర్ వంద ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి ఉంచినట్టు వివరించింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, న్యూఢిల్లిd లాంటి ప్రధాన మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా సరఫరా చేస్తామని తెలిపింది.
ట్రెయో జోర్ 8 కిలోవాట్ల అత్యుత్తమ పరిశ్రమ శక్తితో, 550 కిలోల అత్యధిక శ్రేణి పేలోడ్‌తో ప్రత్యేకమైన కస్టమర్‌లకు విలువైన సేవలు అందిస్తుందన్నారు. 10వేల ఎలక్ట్రిక్ వాహనాలను 2025 నాటికి వినియోగించుకోవాలన్న అమెజాన్ ఇండియా లక్ష్యం ఎంతో బాగుందన్నారు. అమెజాన్ ఇండియా.. 2025-26 నాటికి రూ.10వేల కోట్ల టర్నోవర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ వెహికిల్ త్రీ వీలర్ విభాగంలో మహీంద్రా ట్రై జోర్‌కు 56 శాతం మార్కెట్ వాటా ఉంది. అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్, బిగ్ బాస్కెట్, దేశంలోని ఇతర ఈ-కామర్స్ సంస్థలు.. మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలనే ఉపయోగిస్తున్నాయి.
ముంబై : అమెజాన్ ఇండియాతో మహీంద్రా ఎలక్ట్రికల్ ఒప్పందం
Advertisement
తాజా వార్తలు
Advertisement