Tuesday, November 26, 2024

మాహిష్మతి రాజ్యంలా ‘ఎలిఫాంట్ రాక్’

బాహుబలి వస్తున్నాడు మాహిష్మతి ఊపిరి పీల్చుకో అని స్టార్ హీరోయిన్ అనుష్క చెప్పిన డైలాగ్ గుర్తుందా. బాహుబలిలోని డైలాగ్ ఇది. నిజంగానే మాహిష్మతి రాజ్యాన్ని తలపించేలా ఓ ప్రదేశం ఉందట. ఐస్ ల్యాండ్ లోని హెఇమే ఐలాండ్ లో ఈ ఎలిఫాంట్ రాక్ ఉంది. ఇది ఏనుగు ఆకారంలో సహజంగా ఏర్పడిన రాయి అని తెలుస్తోంది. ఇది చూసిన వారికి కచ్చితంగా బాహుబలి మహిస్మతి నగరంలోని ఏనుగు ఆకారపు భారీ కట్టడం గుర్తుకు రాకమనదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇకపోతే ‘మాహిష్మతి’ పేరు మనం ఎప్పుడూ వినకపోవడంతో ఇది సినిమా కోసం రాజమౌళి క్రియేట్ చేసిన ఓ కల్పిత రాజ్యమని భావిస్తుంటటాం. కానీ ఆ రాజ్యం నిజంగానే ఉందనే విషయం తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారేమో. నిజానికి భారతదేశంలో ఒక ప్రాచీన నగరం ‘మాహిష్మతి’. అవంతి రాజ్య దక్షిణ భాగంలో ఇది అత్యంత ముఖ్యమైనది. ప్రస్తుతం దాని ఖచ్చితమైన స్థానం తెలియనప్పటికీ మధ్యప్రదేశ్ నర్మదా నది ఒడ్డున ఉన్నదని అనేక ప్రాచీన గ్రంథాలలో చెప్పబడింది. అయితే ఈ చరిత్ర అందరికి తెలియకపోయినా ‘బాహుబలి’ సినిమా కారణంగా ‘మాహిష్మతి’ సామ్రాజ్యాన్ని అందరూ గుర్తుంచుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement