Friday, October 18, 2024

మార్చి 3న మామ – అల్లుడు..

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాజా చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రిడ్‌ అల్లుడు’. కె. అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌ మీనా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌, మృణాళిని హీరో, హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకువస్తోంది. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాశారు.
ఇతర పాత్రల్లో సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సి. రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి.

Advertisement

తాజా వార్తలు

Advertisement