Friday, November 22, 2024

మహిళా ఠీవికి దర్పణమిది..

  • మహిళా దినోత్సవాన ఆమెకు ప్రశంసల జల్లు
  • ఎమర్జెన్సీని తప్పుబట్టిన రాహుల్‌
  • ఇందిరాగాంధీ అభిమానుల మనస్తాపం
    న్యూఢిల్లీ – ప్రపంచ వ్యాప్తంగా సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకున్నారు. భారత్‌లో కూడా వివిధ రంగాల్లో తమ ప్రావీణ్యతను ప్రదర్శించిన పలువురు మహిళల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జీవించున్న ఉదాత్త మహిళల్ని సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, శాస్త్ర సాంకేతిక, రాజకీయ రంగాల్లో ఉద్దండులైన మహిళా మణుల్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఇదే రోజున దేశవ్యాప్తంగా అత్యధికులు తలచుకున్న పేరు దివంగత ఇందిరాగాంధీ. భారత మహిళా శక్తికి ఆమె ప్రతిరూపం. ప్రపంచ వ్యాప్తంగా అమెను ఉక్కుమహిళగా పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేత దివంగత వాజ్‌పేయి ఓ సందర్భంలో ఇందిరను దుర్గామాతగా అభినర్ణించారు. ఇందిర ప్రధాని గా ఉండగా తన కార్యాలయంలోని కుర్చీలో ఆశీనురాల య్యారు. ఆమె చుట్టూ డజన్ల సంఖ్యలో మంత్రివర్గ సహ చరులు, కాంగ్రెస్‌ సీనియర్లు నిలబడే ఉన్నారు. ఇందులో దేశం గర్వించదగ్గ మహామహులు, మేథావులు రాజకీయ ఉద్దండులున్నారు. ఇందిర కూర్చుంటే వారంతా నిలబడే మాట్లాడుతున్నారు. దేశంలో మహిళా దినోత్సవాన స్మరించుకోవడానికి మహిళలు ఘనంగా ప్రదర్శించుకోవడానికి ఇంత కంటే గొప్ప ఫొటో మరింకేం ఉంటుందంటూ ఈ ఫొటోను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ ఫొటోలో అప్పటి కాంగ్రెస్‌ అగ్రనేతలు పలువురు కనిపిస్తున్నారు. మొరార్జీదేశాయ్‌, దినేష్‌సింగ్‌, నీలం సంజీవరెడ్డి, ఎస్‌.కె. పాటిల్‌, చిదంబర సుబ్రహ్మణ్యం, సత్యనారా యణ సిన్హా వంటి ఇందిర తొలి కేబినెట్‌ సహచరులతో పాటు కాంగ్రెస్‌ సీనియర్లు కూడా ఈ ఫొటోలో ఉన్నారు. వాస్తవానికి అప్పటికి ఇంకా దేశంలో పూర్తి స్థాయి మహిళాభ్యుదయం ఆచరణలోకి రాలేదు. మహిళలు ఉన్నత విద్య అభ్యసించడం కూడా అంతంత మాత్రమే. అప్పుడప్పుడే మహిళలు వృత్తి ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్న రోజులివి. తొలి ప్రధాని నెహ్రూ రాజకీయ వారసురాలిగా ఇందిర రాజకీయాల్లోకొచ్చారు. లాల్‌బహదూర్‌ శాస్త్రి మర ణానంతరం అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. భారత్‌కు మొట్టమొదటి మహిళా ప్రధానిగా చరిత్రకె క్కారు. ఆమెను ఆ పదవి అంత సునాయాశంగా వరించలేదు. మహామహా ఉద్దండులు ఆమెకు అడ్డం పడ్డారు. రాజకీయ వ్యూహాలతో ఆమెను చక్రబంధం లోకి నెట్టారు. కానీ వాటన్నింటిని ఆమె ఛేదించారు. కాంగ్రెస్‌ పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. దేశ ప్రధాని అయిన తొలిరోజుల్లోనే తన రాజకీయ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. భారత్‌ ఘన చరిత్రకు ప్రతినిధిగా నెహ్రూ వ్యవహరిస్తే ప్రపంచ స్థాయిలో భారత్‌ ప్రతిష్టను ఇందిరాగాంధీ ఇనుమడింపజేశారు. దేశీయంగా ఆమె తీసుకున్న నిర్ణయాలు సంచలనాల య్యాయి. బ్యాంకుల జాతీయకరణను పలువురు సహచరులు వ్యతిరేకించారు. అలాగే కేరళలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వ రద్దును కూడా తప్పుబట్టారు. అయినప్పటికీ ఇందిర తాననుకున్నది ఆచరణలో పెట్టి చూపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన మహిళల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి అద్దం పట్టే చిత్రం ఇంతకంటే ఏముంటుందంటూ పలువురు విశ్లేషించారు. ఇదిలా ఉంటే ఆమె రాజకీయ వారసు లుగా ప్రస్తుత కాంగ్రెస్‌కు నాయకత్వం వహిస్తున్న రాహుల్‌గాంధీ ఇటీవల ఇందిర హయాంలో తీసుకున్న నిర్ణయాల పున:సమీక్ష, వ్యాఖ్యలు దుమారం రేపుతు న్నాయి. అప్పటి పరిస్థితుల్లో ఇందిర దేశంలో ఎమర్జన్సీ విధించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఇందిర ప్రతిష్టను దిగజార్చింది. దేశీయంగా ఆమెకు చెడ్డపేరు తెచ్చింది. అనంతర పరిణామాల్లో అందుకుతగ్గ ఫలి తాన్నిఆమె చవిచూసింది. ఇందిర రక్తానికి వారసుడైన రాహుల్‌ రాజకీయ నిర్ణయాల్లో, చతురతలో ఆమెకు ఏమాత్రం సాటికారు. కానీ ఇందిర అప్పట్లో ప్రకటించిన ఎమర్జన్సీని ఇటీవల ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన తప్పుబట్టారు. ఇందుకు పార్టీ పరంగా తన విచారాన్ని వ్యక్తపర్చారు. ఈ విషయంలో ఇందిర అభిమానులు మనస్థాపానానికి గురౌతున్నారు. రాహుల్‌ తీరును తప్పుబడుతున్నారు. ఇందిర నిర్ణయాన్ని పున:సమీక్షించే లేదా తప్పుబట్టే స్థాయి రాహుల్‌కు లేదని పేర్కొంటున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement