Tuesday, November 26, 2024

మహిళలపై పెరుగుతున్న లైంగిక హింస:డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు పెరిగినట్లు డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక సమయంలో లైగింక వేదింపులకు గురైనట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 736 మిలియన్ల మంది మహిళలు లైంగికహింసకు గురయినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.ఈ జాబితాలో ఎక్కువగా 15 నుంచి 24 సంవత్సరాల వయసుగల వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని మధ్య ఆదాయ, పేద దేశాల్లోనే ఎక్కువగా మహిళలపై హింస జరుగుతోంది. 37 శాతం మంది మహిళలు తమ జీవిత భాగస్వామి నుంచి లైంగిక హింసను ఎదుర్కొన్నట్లు నివేదకలో వెల్లడించింది డబ్ల్యూహెచ్‌వో.

Advertisement

తాజా వార్తలు

Advertisement