దేశంలో కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.679 తగ్గి రూ.44,760గా నమోదైంది. వెండి కూడా పసిడి బాటలోనే నడిచింది. కిలో వెండి రూ.1,867 తగ్గి రూ.67,073కి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో రేట్లు దిగొచ్చాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,930గా నమోదవగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.42,100గా ఉంది. అటు విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,930గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.42,100గానే నమోదైంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement