Tuesday, November 26, 2024

మరో నాలుగు ఫ్లైఓవర్లు

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కుత్బుల్లాపూర్ నియోజక
వర్గం సుచిత్ర జంక్షతో సహా మూడు ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సుచిత్ర జంక్షన్ వద్ద నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ స్థలాన్ని సోమవారం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎస్ఏఐ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై సుచిత్ర జంక్షన్, డైరీ ఫామ్ జంక్షన్, దూలపల్లి జంక్షన్, మేడ్చల్ టౌన్ వద్ద నాలుగు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డీపీఆర్లు రూపొందించామన్నారు.

సుచిత్ర నుంచి గుండ్లపోచంపల్లి వరకు 10.కిమీ. మేర మూడు ఎలివేటెడ్ కారిడార్లు, నాలుగు అండర్ పాస్లు, సర్వీస్ రోడ్డు, జంక్షన్ విస్తరణ జరగనుందన్నారు. దాదాపు రూ.450 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు రూపొందించామన్నారు. గుండ్లపోచంపల్లి నుంచి కళ్లకల్ వరకు సర్వీసు రోడ్డు, జంక్షన్ విస్తరణ తదితర పనులకు రూ.800 కోట్ల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఎన్ హెచ్ఏఐతో సంప్రదింపులు జరుపుతున్నామని త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంలో భాగస్వామి అయినందుకు ఎహె…
అధికారులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement