అమరావతి: ఏపీలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలు దాటే సమయానికి సుమారు 54 శాతంగా నమోదైంది. ఏపీ వ్యాప్తంగా 12 కార్పొరేషన్లు, 71 పురపాలికల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది.
శ్రీకాకుళం-59.93
విజయనగరం-56.63
విశాఖ-47.86
తూ.గో.-66.21
ప.గో.-53.68
కృష్ణా-58.67
గుంటూరు-54.42
ప్రకాశం-64.31
నెల్లూరు-61.03
చిత్తూరు-54.12
అనంతపురం-56.9
కడప-56.63
కర్నూలు-48.87