ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబులపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. కన్నబాబు, అంబటి హెరిటేజ్ సంస్థ పరువు నష్టం కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేశారు..ఈ మేరకు ప్రజా ప్రతినిధుల కోర్టు నిర్ణయం తీసుకుంది.
హెరిటేజ్ సంస్థ పై కన్నబాబు అంబటి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సంస్థ పరువు నష్టం దావా వేసింది దీనికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో జరుగుతుండగా వైసీపీ నేతలు విచారణకు హాజరుకాలేదు. ఫిబ్రవరి 5న వారిద్దరూ విచారణకు రావాలని కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. అటు హెరిటేజ్ అధికారులు కూడా విచారణకు గైర్హాజరు అవడం పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసులో తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది.