మధ్య ప్రదేశ్ లో బస్సు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 40కి పెరిగింది. 60 మందితో వెళుతున్న బస్సు సిద్ది జిల్లా పట్నా వద్ద అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో 7 మంది సురక్షితంగా బయటపడగా సహాయక బృందాలు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకూ 40 మృతదేహాలను వెలికి తీశారు, బస్సు పూర్తిగా మునిగిపోవడంతో సహాయక చర్యలకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. కాగా బస్సు ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement