Tuesday, November 26, 2024

భవిష్యత్తుపై అనిశ్చితి… తక్షణ చర్యలు చేపట్టాల్సిందే: ఆర్బీఐ గవర్నర్

కరోనా సెకండ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు దేశ బ్యాకింగ్ రంగం సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని వర్గాలను ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనవంతు సహకారాన్ని అందిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణాన్ని స్థానిక లాక్ డౌన్ లు, కరోనా వ్యాప్తి ప్రభావితం చేయనున్నాయని అభిప్రాయపడ్డారు. పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వ వర్గాలన్నీ కృషి చేయాలని అన్నారు. ఇండియాలో కేసుల సంఖ్య 2 కోట్లను దాటిన వేళ కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాము నిర్ణయించామన్నారు. నియంత్రణలోకి వచ్చిన కరోనా మహమ్మారి, ఆపై తన ప్రతాపాన్ని చూపించడం ప్రారంభించిందని, అయితే, ఇంతవరకూ కేసులు పెరుగుతూనే వచ్చాయి తప్ప, నియంత్రణా చర్యలు కనిపించలేదని ఆయన అన్నారు.

రుణ అవసరాల నిమిత్తం చూసేవారికి సులువుగా రుణాలను అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా ప్రాధాన్యతా అవసరాలను బట్టి రుణాలను అందించాలని శక్తికాంత దాస్ బ్యాంకులను కోరారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు దీర్ఘకాల రెపో నిర్వహణ కింద రూ. 10 వేల కోట్లను అందిస్తామని తెలిపారు. గతంలో రెండు సంవత్సరాల పాటు మారటోరియం సదుపాయాన్ని పొందిన వారికి మరో రెండేళ్ల మారటోరియంను ప్రకటిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement