Friday, November 22, 2024

బెంగళూరు : ఎంసీఎఫ్ లో మాల్యా వాటాల విక్రయం

 యూబీ గ్రూప్‌ నుంచి బకాయిల రికవరీలో భాగంగా మంగళూరు కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌లో విజయ మాల్యాకు చెందిన 12 శాతం వాటాను బ్యాంకులు విక్రయిం చాయి. షేర్లను స్టాక్‌ మార్కెట్లో అమ్మేశాం. వచ్చిన మొత్తాన్ని బకాయిల్లో జమ చేసుకుంటామని బ్యాంకులు వివరించాయి. కాగా షేర్ల విక్రయం ద్వారా చాలా తక్కువ మొత్తంలో బకాయిలు వచ్చాయి. మొత్తం రూ.9,200 కోట్లతో పోల్చితే ప్రస్తుతం వచ్చినవి అతిస్వల్పమని బ్యాంకర్లు వివరించారు. ఎంసీఎఫ్‌లో మాల్యా వాటా విక్రయించడంతో యూబీ గ్రూప్‌, ఎంసీఎఫ్‌ మధ్య దశాబ్ద కాల బంధానికి ముగింపు పలికి నట్టయింది. 1990 దశకం లో యూబీలోకి ఎంసీఎఫ్‌ గ్రూపు అడుగుపె ట్టింది. కాగా ఎంసీఎఫ్‌ ప్రస్తుత ప్రమోటర్‌ అడ్వాం టేజ్‌ గ్రూప్‌ కంపెనీలో క్రమంగా వాటాను పెంచుకుం టోంది. కాగా గురువారం సెషన్‌లో ఎంసీఎఫ్‌ షేర్లు 10 శాతం మేర వృద్ధి చెందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement