Friday, November 22, 2024

బుమ్రాను పెళ్ళాడేది ఆమెనా…?

టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా  త్వరలోనే పెళ్ళాడతాడు అనేది లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అందుకోసమే ఆతడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టు నుంచి తప్పుకున్నాడు అని అని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. నాటి నుంచి బుమ్రా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడని, ఆ ఏర్పాట్లలో భాగంగానే ఈ ఫాస్ట్‌బౌలర్‌ సెలవు తీసుకున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించింయి. ఇక అప్పటినుంచి సౌతిండియా నటీ అనుపమ పరమేశ్వర్‌, బుమ్రా పెళ్ళి చేసుకోనున్నారని గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేసారు. కాని బుమ్రా పెళ్ళికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అందరి అంచనాలను తలక్రిందులుగా చేసింది.

అదేంటంటే ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు సంజనా గణేషన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నాడని సోషల్‌ మీడియాలో మళ్లీ ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7 తో కెరీర్‌ ఆరంభించారు. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన ఆమె, ఐపీఎల్‌ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బుమ్రాతో ఏర్పడిన పరిచయం, పరిణయానికి దారి తీసిందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అ‍యితే వధువు ఎవరన్న విషయంపై మాత్రం ఇంతవరకు సస్పెన్స్‌ వీడటం లేదు! అయితే, హాలిడే మూడ్‌లో ఉన్నానంటూ అనుపమ, బుగ్గలకు పసుపు, కుంకుమ రాసుకున్న ఫొటో షేర్‌ చేయడంతో మెజారిటీ మంది అనుపమే ఆ లక్కీ గర్ల్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చూడాలి మరి బుమ్రా పెళ్ళి అయ్యేంతవరకు ఈ రూమర్లు ఆగేటట్లు లేవు. వీటికి పులిస్టాప్ పడాలంటే బుమ్రా పెళ్లి వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement