జపాన్లోని అటామి నగరంలో బురద బీభత్సం సృష్టించింది. సముద్ర తీర పట్టణమైన అటామిలో నిన్న భారీ వర్షం కురిసింది. దీనికి తోడు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోయలు, పర్వత ప్రాంతాల్లోని మట్టి వదులుగా మారి సమీప పట్టణాలు, గ్రామాలను ముంచెత్తుతోంది. వరద వెల్లువలా విరుచుకుపడడంతో 19 మంది గల్లంతయ్యారు. వేగంగా దూసుకొచ్చిన ఈ బురద దాటికి 80 ఇళ్లు పూర్తిగా పూడుకుపోయాయి. కార్లు కొట్టుకుపోయాయి. వెల్లువలా దూసుకొచ్చిన బురదను చూసి జనం భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇది కూడా చదవండి: షర్మిల పార్టీ పెట్టగానే పరీక్ష.. పాసవుతుందా?