ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామని బెదిరింపు కాల్ చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సల్మాన్(22) అనే యువకుడు నిన్న రాత్రి ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేసి, ప్రధానిని చంపేస్తామని బెదిరించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సల్మాన్ను అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సల్మాన్.. బెయిల్పై జైలు నుంచి ఇటీవలే విడుదలయ్యాడు. గతేడాది జనవరి నెలలోనూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను చంపేస్తామని బెదిరించాడు. సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆన్లైన్లో పలు పోస్టులు పెట్టాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement