ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ అభివృద్ధి చేసిన ‘స్టార్‌షిప్’ రాకెట్ చివరిదశలో విఫలమైంది. ల్యాండింగ్ ప్యాడ్‌పై సాఫీగా దిగిన రాకెట్ ఆ వెంటనే భారీ శబ్దంతో పేలిపోయింది. 10 కిలోమీటర్ల ఎత్తులోకి దూసుకెళ్లిన స్టార్‌షిప్.. నిలువుగా దిగుతూ అక్కడ ఏర్పాటు చేసిన ల్యాండింగ్ ప్యాడ్‌పై సాఫీగానే ల్యాండ్ అయింది. దీంతో ప్రయోగం విజయవంతమైందని ప్రకటించి ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసి సంబరాలు చేసుకున్నారు. అయితే, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కొన్ని నిమిషాల తర్వాత భారీ విస్ఫోటనంతో గాల్లోకి లేచిన స్టార్‌షిప్ పేలిపోయింది. కాగా, గతంలో చేపట్టిన రెండు ప్రయోగాలు కూడా ఇలానే విఫలమయ్యాయి. టెక్సాస్‌లోని బొకా చికాలో ఈ ప్రయోగం చేపట్టింది ఆ సంస్థ.
Advertisement
తాజా వార్తలు
Advertisement