Friday, November 22, 2024

పూజా భట్‌ ఫస్ట్‌ కిస్‌ ఎక్స్‌పీరియన్స్

బాలీవుడ్ నటి పూజాభట్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఒక ఎక్స్‌పీరియన్స్‌ను ఇప్పుడు షేర్ చేసుకుంది. 49 సంవత్సరాల పూజాభట్ పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి అప్పటికీ ఇప్పుడు మళ్ళీ నటిస్తుంది. నటిగా ఎంట్రీ ఇచ్చిన రోజుల్లో ఎక్స్పీరియన్స్ తాజాగా రిలీజ్ చేసింది పూజాభట్.

సడక్’ అనే చిత్రంలో రొమాంటిక్‌ సన్నివేశం చేసేటప్పుడు తన తండ్రి తనకి సలహా ఇచ్చారని, కిస్‌ సన్నివేశం పండాలంటే ఏం చేయాలో విపులంగా విశదీకరించారని.. పూజా భట్‌ అప్పటి సంచలన విషయాలను రివీల్‌ చేసింది. చాలా కాలంగా నటిగా సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పూజా భట్‌.. ‘బాంబే బేగమ్స్’ అనే వెబ్‌ సిరీస్‌తో నటిగా రీఎంట్రీ ఇస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ నెట్‌ ఫ్లిక్స్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా పూజా భట్‌ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆ ఇంటర్వ్యూలో తన ఫస్ట్‌ కిస్ ఎక్స్‌పీరియన్స్‌ గురించి తెలిపింది.

ఆమె మాట్లాడుతూ.. ”సడక్‌ మూవీ సెట్స్‌లో నేను నేర్చుకున్న మొదటి పాఠం నాకు ఇంకా గుర్తుంది. నా రూమ్‌లో గోడకి అతికించుకుని, ఆరాధించిన ఫొటోలో ఉన్న సంజయ్‌ దత్‌ని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు నాకు 18 సంవత్సరాలు. భయంతో వణుకు వచ్చేస్తుంది. అప్పుడు నాన్న మహేష్‌ భట్‌.. నన్ను పక్కకు తీసుకెళ్లి చెప్పిన విషయం జీవిత పాఠంగా గుర్తుండిపోయింది. ‘పూజా.. ముద్దుని నీవు వల్గర్‌గా భావిస్తే.. అది వల్గర్‌గానే కనిపిస్తుంది. అదే నువ్వు ఆ ముద్దు సన్నివేశాన్ని లేదా రొమాంటిక్‌ సన్నివేశాన్ని ప్రేమిస్తూ.. ఇష్టంతో, గౌరవంగా భావించి చేస్తే.. అంతే గౌరవంగా ఆ సన్నివేశం కనిపిస్తుంది. ఆ సన్నివేశం ఇంటెన్షన్‌ ఏంటో తెలుసుకోవాలి..’ అని నాన్న చెప్పిన మాటలతో ఆ సన్నివేశం అద్భుతంగా చేయగలిగాను. నాన్న చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ నేను చేసే ప్రతి సన్నివేశానికి గుర్తు చేసుకుంటాను..” అని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement