పుదుచ్చేరి అసెంబ్లీలో జరిగిన బల నిరూపణలో వి. నారాయణ స్వామి ఓడిపోయారు. దీంతో దాదాపు నాలుగున్నర ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. బల నిరూపణలో ఓటమి చెందగానే, తన రాజీనామా లేఖతో నారాయణ స్వామి రాజ్ భవన్ కు వెళ్లారు. తెలంగాణ గవర్నర్ తో పాటు పుదుచ్చేరి తాత్కాలిక లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న తమిళ సైకి ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు..దీనిపై తమిళ సై నిర్ణయం తీసుకోనున్నారు.. ఇది ఇలా ఉంటే మరో రెండు నెలలో పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికలు జరగవలసి ఉన్నది.. ఈ తరుణంలో పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో నారాయణస్వామి ప్రభుత్వ మైనార్టీలో పడిపోయింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement