Friday, November 22, 2024

పోలీసుల అదుపులో పుట్ట మధు… సీన్ లోకి ఈట‌ల కొడుకు?!

టీఆర్ఎస్ నేత, పెద్ద‌ప‌ల్లి జెడ్పీ చైర్మ‌న్ పుట్టా మ‌ధును రామ‌గుండం పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజులుగా క‌నిపించ‌కుండా పోయిన పుట్టా మ‌ధును ఏపీలోని భీమ‌వ‌రంలో అదుపులోకి తీసుకున్నారు.  మాజీ మంత్రి ఈటలలో సన్నిహిత సంబంధాలు  ఉన్న పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో సంచలనం రేపిన లాయ‌ర్లు వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో పుట్టా మ‌ధుపై ఆరోప‌ణ‌లున్నాయి. అయితే, టీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి నాయకులపై స‌స్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. పుట్టా మ‌ధును ఒక‌రకంగా సేఫ్ చేసింది. కానీ ఇప్పుడు ఇదే కేసులో అరెస్ట్ పుట్ట మధును అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పుట్టా మ‌ధును ఇంట‌లిజెన్స్ పోలీసులే ర‌మ్మ‌న్నార‌ని… అందుకే ఆయ‌న వెళ్లిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  అయితే, ఈ మొత్తం వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి ఈట‌ల కొడుకు నితిన్ పేరును తెర‌పైకి తెచ్చే అవకాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

వీరిద్ద‌రికి వ్యాపార సంబంధాలున్నాయ‌ని, వామన్ రావు హ‌త్య‌కు ముందు వీరి మ‌ధ్య చెల్లింపులు జ‌రిగిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే అంశంపై ఈటల కొడుకు నితిన్ ను కూడా పోలీసులు ప్ర‌శ్నించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. నిజానికి ఈట‌ల‌, పుట్టా మ‌ధు మ‌ధ్య మంచి సంబంధాలున్నాయి. ఈట‌ల పార్టీకి దూర‌మైన నేప‌థ్యంలోనే… పుట్టా మ‌ధు కూడా పార్టీ దూరం అవుతార‌న్న ఉద్దేశంతోనే ఈ కేసును తోడుతున్నార‌ని, ఈట‌ల‌ను నేరుగా ప్ర‌శ్నిస్తే… సానుభూతి వస్తుంద‌న్న ఉద్దేశంతో ఆయ‌న కొడుకును టార్గెట్ చేసిన‌ట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ తో పుట్టా మధుకు వ్యాపార లావాదేవీలను కూడా నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈటలతో సంబంధాల నేపథ్యంలో మధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement