Friday, November 22, 2024

పిట్టల రెట్టలతో లక్షల్లో సంపాదన..పక్షుల మలంతో కాఫీ

కాఫీలో చాలా రకాలు ఉన్నాయి..ఫిల్టర్ కాఫీని ఎక్కువగా అందరూ ఇష్టపడతారు. కానీ ఇక్కడో వింత సంగతి మీకు తెలుసా..పక్షులు రెట్టలతో కాఫీ తయారు చేస్తున్నారట.  పక్షులు విసర్జించే మలంతోనే అక్కడ రుచికరమైన కాఫీని తయారు చేస్తున్నారు. జాకో బర్డ్ కాఫీ చాలా ఫేమస్ అవుతోంది. బ్రెజిల్ లో అరుదైన పక్షి ఇది. ఈ పక్షి కాఫీ తోటల్లోకి చేరి అక్కడి కాఫీ గింజలని తెగ ఇష్టంగా తింటోందట. దాంతో ఆ తోట యజమానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఎదురయిందట. ఎందుకంటే ఆ పక్షులను చంపితే అక్కడ నేరం కావడమే. దాంతో ఓ సూపర్ ఐడియా వచ్చిందట. పక్షుల రెట్టలను సేకరించి వాటిలో కాఫీ గింజలను వేరు చేసి వాటిలోని పోషకాలు..రుచికి నష్టం లేకుండా తయారు చేయడం..ఆ కాఫీనే జనాలు తెగ ఇష్టపడటం ఆ కాఫీకి  బాగా డిమాండ్ పెరిగిందట. ఆ వీడియో మీ కోసం.జాకో బర్డ్ కాఫీ కిలో నే దాదాపు 75వేల రూపాయలట.  ఈ కాఫీ తయారు చేస్తోన్న యజమానికి కాసుల వర్షమే. తెగ కుష్ అవుతున్నాడట. పిట్టల రెట్టలతో లక్షలు సంపాదిస్తున్నాడంటే మాటలా మరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement