ఇవాళ కూడా ఉభయసభల్లోనూ విపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు పాత పద్ధతిలో సమావేశమయ్యాయి. 11 గంటలకు ప్రారంభమైన ఉభయసభలు తొలుత 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. పెట్రో ధరల పెరుగుదల అంశంపై చర్చ చేపట్టాలని ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. దీంతో తొలుత 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే ఆ తర్వాత సమావేశాలు ప్రారంభమైనప్పటికీ ఇరు సభల్లో విపక్షాలు మళ్ళీ పెట్రోల్ ధరలపై చర్చించాలని పట్టు పట్టాయి. దీంతో లోక్‌సభను మీనాక్షి లేఖి, రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement