Monday, November 25, 2024

పారిస్ : అవినీతి కేసులో అడ్డంగా దొరికి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు- మూడేళ్ల జైలు

: ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీకి అవినీతి కేసులో ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోలో న్యాయమూర్తి గిల్బర్ట్‌ అజిబర్ట్‌కి పదోన్నతిని కల్పించారన్న ఆరోపణలను సర్కోజీ ఎదుర్కొంటున్న సంగతి విదితమే. అవినీతికి సంబంధించిన ఈ కేసు ఆరోపణలను సమర్ధించిన ఫ్రెంచ్‌ కోర్టు సోమవారం ఆయనను దోషిగా తేల్చింది. సర్కోజీకి మూడేళ్ల  జైలు శిక్ష విధించింది. అందులో రెండేళ్లు సస్పెండ్‌ చేసింది. దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్‌ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అపీల్‌ చేసేందుకు ఆయనకు కోర్టు పది రోజులు గడువు ఇచ్చింది. నికోలస్‌ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement