సామాజిక మాధ్యమం అత్యంత శక్తివంతంగా, ప్రమాదకారిగా మారిందని బీజేపీ నేత రామ్‌మాధవ్ అన్నారు. ప్రభుత్వాలనే కూల్చి వేసే స్థాయిలో సోషల్ మీడియా ప్రభావితం చేస్తోందని చెప్పారు. అరాచకాన్ని ప్రేరేపించి, ప్రజాస్వామ్యాన్ని బలహీనంచేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిని నియంత్రించ డానికి ప్రస్తుత చట్టాలు సరిపోవడం లేదని, అందు కే భారత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చే పనిలో ఉన్నదని వెల్లడించారు. బికాజ్ ఇండియా కమ్స్ ఫస్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన సామాజిక మాధ్యమాల అంశాన్ని ప్రస్తావించా రు. రాజకీయేతర, రాజ్యేతర శక్తులతో ప్రజాస్వా మ్యం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా ఎంత శక్తవంతమైనదంటే అది ప్రభు త్వాలనే కూల్చేయగలదు. వాటికి #హద్దులంటూ ఏమీ లేకపోవడంతో నియంత్రించడం కష్టమవు తోంది. ఈ శక్తులు అరాచకానికి దారితీస్తాయి. మన రాజ్యాంగంలోనే పరిష్కారాలు ఉన్నాయి అని రామ్‌మాధవ్ అన్నారు. ట్విటర్‌తో కేంద్ర ప్రభుత్వం ఘర్షణ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య లు చేశారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి కృషి చేసిన ఏ నేతనీ తాము మరిచిపోమని, సంఘ్ కూడా ఎన్నడూ గాంధీ పాత్రను చిన్నదిగా చేయ దని తెలిపారు. గాంధీ చాలా గొప్ప నేత, ఆయన చూపిన అ#హంసామార్గం ప్రపంచ నేతలకు మార్గ దర్శకం అయింది. అభిప్రాయాల భేదాలుండొ చ్చు. అలాగని వారంటే గౌరవం లేదని కాదు. సంఘ్ ప్రాత:స్మరణంలో గాంధీ పేరు కూడా ఉం టుందని రాం మాధవ్ గుర్తు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement