Friday, November 22, 2024

న్యూఢిల్లీ : సమున్నత లక్ష్యంతో ఠాగూర్ విశ్వభారతి విశ్వవిద్యాలయం : ప్రధాని మోడీ

విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యా వ్యవస్థను   రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ సమున్నత లక్ష్యంతో అభివృద్ధి చేశారని ప్రధాన మంత్రి నరేంద్ర వెూదీ అన్నారు. విశ్వభారతి విశ్వవిద్యాలయం  కాన్వొకేషన్‌ సందర్భంగా శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా మాట్లాడారు. లోబడి ఉండాలనే సంకెళ్ళ నుంచి భారతదేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడం, ఆధునికీకరించడం లక్ష్యంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారన్నారు.  నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) లక్ష్యం కూడా పాత సంకెళ్ల నుంచి భారత దేశ విద్యా వ్యవస్థకు విముక్తి కల్పించడమేనని వెూదీ చెప్పారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించగలిగే స్వేచ్ఛను నూతన విద్యా విధానం ఇస్తుందన్నారు. స్వయం సమృద్ధ భారత దేశం వైపు వేసిన గొప్ప ముందడుగు నూతన జాతీయ విద్యా విధానమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement