Monday, November 25, 2024

న్యూఢిల్లీ : శాశ్వత పరిష్కారం దిశగా భారత్ – చైనా చర్చలు

భారత్‌-చైనా వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యాత్మక పాయింట్ల వద్ద నుంచి కూడా బల గాల ఉప సంహరణతో పాటు కొన్ని కీలక విషయా లపై చర్చించేందుకు ఇరు దేశాల సీనియర్‌ కమాండర్‌ స్థాయి అధికారులు శనివారం భేటీ అయ్యారు. చైనా లోని మోల్డోలో నిర్వహించిన ఈ భేటీకి.. భారత్‌ తరఫున లేహ్‌లోని 14వ కార్ప్స్‌ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ పీజీకే మేనన్‌, చైనా తరఫున దక్షిణ షింగ్‌ యాంగ్‌ మిలటరీ డిస్ట్రిక్‌ కమాండర్‌ మేజర్‌ లియు లిన్‌ హాజరయ్యారు. 10వ తేదీన పాంగాంగ్‌ సరస్సు వద్ద జరిగిన ఒప్పందం ప్రకారం పాంగ్యాంగ్‌ ఇరువై పులా బలగాలను భారత్‌, చైనా ఉప సంహరించు కున్నాయి. ఈ ప్రక్రియ శుక్రవారం నాటికి పూర్తవ్వ డంతో తాజాగా 10వ విడత చర్చలు నిర్వహించారు.
ఇరు దేశాల అధికారులు.. కీలక పాయింట్లైన గోగ్రా, 900 చదరపు కిలో మీటర్ల డెప్సాంగ్‌ మైదానంపై చర్చించారు. ఈ ప్రాంతాల్లో మోహరించిన బలగాల ఉప సంహరణపై మాట్లాడినట్టు సమాచారం.
2013లో డెప్సాంగ్‌ మైదానంలో పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. మళ్లిd గతేడాది మేలో జరిగిన ప్రతిష్ఠంభనలో ఈ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అయితే వాస్తవాధీన రేఖ వెంట ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని ఇటీవ ల జరిగిన భేటీలో భారత్‌ పట్టుబట్టింది.
10వ కార్ప్స్‌ కమాండర్‌ స్థాయి సమావేశంలో.. పాంగ్యాంగ్‌ ట్సో సరస్సు ఉత్తర, దక్షిణ ఒడ్డున నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.
పాంగ్యాంగ్‌ ట్సో సరస్సు వద్దకు.. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీతో కలిసి.. భారత్‌ ఆర్మీ భౌతికం గా పరిస్థితులను సమీక్షించింది. ఇరు దేశాల ఆర్మీ అధికారులు కలిసి నిర్వహించిన జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ అంటూ భారత్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.
చైనా బూటకపు వీడియో..
తూర్పు లడఖ్‌ లోయలో ఘర్షణకు సంబంధించి చైనా ఓ వీడియోను విడుదల చేసింది. గొడవకు కారణం భారత్‌ అంటూ మరోసారి దుష్ప్రచారానికి తెరలేపింది. చర్చలకు ఒక రోజు ముందు ఈ వీడియో విడుదల చేయడం గమనార్హం. జూన్‌, గాల్వాన్‌ లోయలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడి యో ఆ దేశ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ విడు దల చేసింది. పదుల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు.. తూర్పు లడఖ్‌.. గాల్వాన్‌ లోయలోని చల్లటి నీటితో కూడిన సరస్సును దాటుతూ ఒడ్డుకు చేరుకున్నట్టు వీడియోలో స్పష్టం అవుతోంది. ఇరు దేశాల సైనికు లు.. రాళ్లతో కూడి నది ఒడ్డుకు చేరుకుని ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణకు దిగినట్టు చెబుతోంది. మళ్లిd రాత్రి.. ఫ్లాష్‌ లైట్ల మధ్య కొండ అంచున నిలబడి లాఠీలు, కర్రలతో కొట్టుకున్నారని వివరించింది. చీకట్లో సైనికుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి. తమ వైపు నుంచి చనిపోయిన నలుగురు సైనికులకు నివాళులర్పిస్తున్నట్టు చైనా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement